సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!

- July 18, 2026 , by Maagulf
సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!

రియాద్: సౌదీ అరేబియాలో సొంత ఇళ్ల యాజమాన్యం గణనీయంగా పెరిగింది. 2016లో 47 శాతంగా ఉన్న గృహ యాజమాన్య రేటు 2025 చివరి నాటికి 66.24 శాతానికి చేరిందని మున్సిపాలిటీలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి మాజిద్ అల్-హొగైల్ తెలిపారు. 2030 నాటికి 70 శాతం గృహ యాజమాన్య లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి అర్బన్ అజెండా ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడిన మంత్రి, సుస్థిర పట్టణాభివృద్ధిలో సౌదీ విశేష పురోగతి సాధించిందన్నారు. 2018 నుంచి 2025 మధ్య కాలంలో 25 శాతానికి పైగా సౌదీ కుటుంబాలు గృహ సహాయ పథకాల ద్వారా లబ్ధి పొందాయని వెల్లడించారు.

రియాద్ మెట్రో ప్రారంభమైన తొలి తొమ్మిది నెలల్లోనే 10 కోట్లకు పైగా ప్రయాణికులు సేవలు వినియోగించగా, 2025లో పట్టణ బస్సు సర్వీసుల్లో 9.68 కోట్ల మంది ప్రయాణించినట్లు తెలిపారు. మహిళల ఉద్యోగాల్లో భాగస్వామ్యం 22.8 శాతం నుంచి 36 శాతానికి పెరగడంతో పాటు, వికలాంగుల ఉపాధి కూడా రెండింతలు పెరిగిందన్నారు. పచ్చదనం, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా సుస్థిర నగరాల నిర్మాణానికి సౌదీ కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com