అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- July 18, 2026
మస్కట్: ఒమన్‌లోని ధోఫార్ గవర్నరేట్‌కు చెందిన సలాలా నగరానికి దక్షిణంగా అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో మోస్తరు భూకంపం నమోదైంది. గురువారం సాయంత్రం 4:01 గంటలకు భూకంపం సంభవించినట్లు సుల్తాన్ ఖాబూస్ యూనివర్సిటీ భూకంప పర్యవేక్షణ కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం సలాలాకు సుమారు 239 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదని పేర్కొన్నారు. భూకంప ప్రభావం జనావాస ప్రాంతాలపై పడలేదని అధికారులు స్పష్టం చేశారు. భూకంప పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని అధికారులు సూచించారు
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







