జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- July 18, 2026
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. తొలిసారి జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డులకు ఎక్కింది. తెలుగు తేజం సింధు సెమీస్‌లో చైనాకు చెందిన చెన్ యుఫీయుని 21-19, 15-10 తేడాతో ఓడించింది. ఈ క్రమంలో చైనా ప్రత్యర్థిపై ఐదు గేమ్‌ల ఓటమి పరంపరకు ముగింపు పలికింది.
రెండో సెట్లో సింధు ఆధిక్యంలో ఉన్న సమయంలో తొడ కండరాల గాయం కారణంగా యుఫీయ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో సింధు ఫైనల్లో అడుగుపెట్టింది. కాగా.. గత రెండళ్ల కాలంలో ఓ టోర్నీలో సింధు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మరో సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వార్దానీపై జపాన్‌కు చెందిన అకానె యమగూచి విజయం సాధించింది. తొలి సెట్లో ఓడిపోయినప్పటికి ఆ తరువాత వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని 9-21, 21-16, 21-14 తేడాతో యమగూచి విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







