కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- July 19, 2026
కువైట్ సిటీ: కువైట్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన క్షిపణి, డ్రోన్ దాడులను దేశ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు కువైట్ సైన్యం ఆదివారం ప్రకటించింది.
ఈ మేరకు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేలుళ్ల శబ్దాలు శత్రు క్షిపణులు, డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేస్తున్న సమయంలో ఏర్పడుతున్నవేనని స్పష్టం చేసింది.
ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, సంబంధిత అధికార యంత్రాంగం జారీ చేస్తున్న భద్రతా, రక్షణ సూచనలను తప్పనిసరిగా పాటించాలని సైన్యం విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుత పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







