వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- July 22, 2026
మనామా: వెయిట్ లాస్ సర్జరీ (మినీ గ్యాస్ట్రిక్ బైపాస్) అనంతరం ఇద్దరు పిల్లల తల్లి మరణించిన ఘటనపై స్వతంత్ర, అత్యవసర దర్యాప్తు చేపట్టాలని బహ్రెయిన్ ఎంపీ మొహమ్మద్ అల్ జనాహి డిమాండ్ చేశారు. ఈ ఘటనలో వైద్య నిర్లక్ష్యం జరిగి ఉండొచ్చని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మృతురాలు అజీజా జనాహి ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్న తర్వాత తీవ్రమైన నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో పలుమార్లు అదే ఆస్పత్రిని ఆశ్రయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఇవి సర్జరీ అనంతరం సాధారణంగా కనిపించే లక్షణాలేనని వైద్యులు చెప్పి నిర్లక్ష్యం చేశారని, ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేకపోయినా ఆమెను డిశ్చార్జ్ చేశారని ఆరోపించారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మరింత విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (NHRA) పూర్తిస్థాయి విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఎంపీ మొహమ్మద్ అల్ జనాహి కోరారు. వైద్య నిబంధనలను ఉల్లంఘించినా లేదా విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మృతురాలి కుటుంబ సభ్యులకు, ప్రజలకు నిజాలు తెలుసుకునే హక్కు ఉంది. అందుకే పారదర్శకంగా విచారణ జరగాలి అని ఎంపీ మొహమ్మద్ అల్ జనాహి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్బాస్ హౌస్లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు
- బహ్రెయిన్-సౌదీ మధ్య సరిహద్దు ట్యాక్సీ సేవలు ప్రారంభం..
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!







