OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- July 23, 2026
మస్కట్: తయారీ లోపం ఉన్న కొత్త కారును కొనుగోలు చేసిన వినియోగదారుడికి 32,000 ఒమానీ రియాల్స్ (OMR) విలువైన కొత్త వాహనాన్ని డీలర్‌షిప్ ద్వారా అందేలా చేసి, ఒమాన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) మరోసారి వినియోగదారుల హక్కులను కాపాడింది.
ఉత్తర అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో జరిగిన ఈ ఘటనలో.. కొత్త కారును కొనుగోలు చేసిన కొద్ది రోజులకే డ్యాష్‌బోర్డుపై హెచ్చరిక లైట్ వెలగడంతో వినియోగదారుడు వెంటనే వాహనాన్ని డీలర్‌షిప్‌కు తీసుకెళ్లాడు. సాంకేతిక పరీక్షల్లో ఇంజిన్‌లో ఇంజిన్ ఆయిల్ లేకపోవడం గుర్తించారు. ఈ లోపం కారణంగా ఇంజిన్‌కు తగిన లూబ్రికేషన్ అందక తీవ్ర నష్టం కలిగే అవకాశం లేదా పూర్తిగా ఇంజిన్ పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని సీపీఏ వెల్లడించింది. తదుపరి పరిశీలనలో ఈ వాహనం తయారీ లోపం కారణంగా కంపెనీ ప్రకటించిన రికాల్ జాబితాలో కూడా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
వినియోగదారుడి ఫిర్యాదు మేరకు సీపీఏ డీలర్‌షిప్‌తో చర్చలు జరిపి ఇరు పక్షాల మధ్య సామరస్యపూర్వక ఒప్పందం కుదిరేలా చేసింది. ఈ ఒప్పందం ప్రకారం, డీలర్‌షిప్ లోపభూయిష్టమైన వాహనానికి బదులుగా 32,000 ఒమానీ రియాల్స్ విలువైన సరికొత్త వాహనాన్ని వినియోగదారుడికి అందజేసింది. దీంతో కోర్టు విచారణ అవసరం లేకుండానే వివాదం పరిష్కారమైంది.
వినియోగదారుల హక్కుల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ మరోసారి స్పష్టం చేసింది. లోపభూయిష్టమైన ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే తమ అధికారిక కమ్యూనికేషన్ మార్గాల ద్వారా వెంటనే తెలియజేయాలని వినియోగదారులకు సూచించింది.
తాజా వార్తలు
- బ్రిక్స్ పై గ్లోబల్ సౌత్‌కు నమ్మకం పెరిగింది: ప్రధాని మోదీ
- ఫిలిప్పీన్స్ లో బోటు ప్రమాదం..76కు చేరిన మరణాలు
- న్యూఢిల్లీలో పుతిన్‌తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- BRICS సమ్మిట్..నేటి షెడ్యూల్ ఇదే
- తెలంగాణ అసెంబ్లీ సెషన్: ప్రజా విశ్వాసం బిల్లు-2026 ఆమోదం
- తమిళ సినీ అభిమానులకు సర్ప్రైజ్.. సిల్వర్‌స్టోన్‌లో విజయ్, అజిత్ కుమార్ కలయిక
- SIIMA 2026 తెలుగు,కన్నడ విజేతలు వీరే..
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- యూఏఈ లాటరీలో Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!
- బహ్రెయిన్‌లో BD14,000 విలువైన చోరీలు.. ఐదుగురు అరెస్ట్..!!







