అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- July 24, 2026
కువైట్ సిటీ: కువైట్‌లోని అల్-అబ్దాలి సరిహద్దు చెక్‌పోస్ట్‌పై గురువారం మధ్యాహ్నం డ్రోన్లతో దాడి జరిగినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది.
రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ సౌద్ అల్-అత్వాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు. సంబంధిత అధికారులతో కలిసి ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదే సమయంలో పేలుడు పదార్థాల నిర్వీర్య బృందాలు (EOD) ఘటనాస్థలాన్ని పూర్తిగా పరిశీలించి, డ్రోన్ల శకలాలను తొలగించడంతో పాటు, సరిహద్దు చెక్‌పోస్ట్ పరిసర ప్రాంతం పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించాయి.
కువైట్ సాయుధ దళాలు దేశ సరిహద్దుల రక్షణతో పాటు దేశ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు అత్యున్నత అప్రమత్తతతో పూర్తి సంసిద్ధతలో విధులు నిర్వహిస్తున్నాయని కల్నల్ అల్-అత్వాన్ తెలిపారు.
తాజా వార్తలు
- 974 బీచ్‌లో ‘ఫ్లోటీస్ ఫెస్టివల్’.. సందడి చేసేలా ఏర్పాట్లు..!!
- కువైట్‌లో ప్రవాసులకు లోన్లు మరింత కఠినం..!!
- సౌదీ–ఖతార్‌లో కొత్త చెల్లింపు సదుపాయం..!!
- ఆర్థిక, ఆర్థిక సహకారం బలోపేతంపై బహ్రెయిన్–సెర్బియా చర్చలు..!!
- టెస్లా కార్లు రీకాల్.. ఎయిర్‌బ్యాగ్‌లో సాంకేతిక లోపం..!!
- సుల్తాన్ బోట్స్వానా పర్యటనతో కొత్త పెట్టుబడి అవకాశాలు..!!
- షార్జాలో విషాదం.. ఇంట్లో కుప్పకూలి 32 ఏళ్ల భారతీయ మహిళ మృతి..!!
- పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు..పోలీసు అధికారులతో డీజీపీ కీలక చర్చలు
- అబుదాబిలో యూఏఈ–ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరం ప్రారంభం
- మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్







