భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!

- July 24, 2026 , by Maagulf
భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!

మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ‌తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. ఆసియాన్ (ASEAN) ట్రీటీ ఆఫ్ అమిటీ అండ్ కోఆపరేషన్ ఒప్పందం కుదిరి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన మంత్రుల సమావేశం సందర్భంగా ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా సముద్ర రవాణా, సప్లై చైన్స్ అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఇరు దేశాలు సమన్వయాన్ని కొనసాగించాలని ఇరు మంత్రులు పునరుద్ఘాటించారు.

అలాగే ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం, పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను దౌత్య, శాంతియుత మార్గాలు, పరస్పర అంగీకారంతో పరిష్కరించాల్సిన అవసరాన్ని వారు తెలియజేశారు.  ఈ సమావేశంలో ఫిలిప్పీన్స్‌ లోని ఒమన్ రాయబారి ఇంజినీర్ నాసర్ అల్ మన్వారితో పాటు ఇరు దేశాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com