గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- July 25, 2026
న్యూ ఢిల్లీ: అదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలై 25–27 తేదీల్లో గోవా విల్లాజియో రిసార్ట్, సౌత్ గోవాలో ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎస్. ఆదినారాయణ వెల్లడించారు. న్యూఢిల్లీలోని అశోక్ రోడ్డులో తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణం వెలుపల నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘యువశక్తికి ప్రేరణ–నవకల్పనకు ఊతం – వికసిత్ భారత్–2047 నిర్మాణానికి యువత భాగస్వామ్యం’ అనే అంశంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల 100 మంది యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, యువ వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే సదస్సులో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విజయవంతమైన వ్యాపారవేత్తలు, పరిశ్రమల నిపుణులు, విధాన రూపకర్తలు ప్రేరణాత్మక ప్రసంగాలు చేయనున్నారు. నాయకత్వ వికాసం, వ్యక్తిత్వ వికాసం, పారిశ్రామిక అవకాశాలు, స్టార్టప్‌ల విస్తరణ, నవకల్పనలు, డిజిటల్ సాంకేతికత వినియోగం, ఉపాధి సృష్టి, స్వయం ఉపాధి విస్తరణపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో యువ పారిశ్రామికవేత్తల పాత్ర, దేశ ఆర్థికాభివృద్ధిలో వారి బాధ్యత, ఉపాధి సృష్టిలో వారి భాగస్వామ్యంపై ప్రత్యేక చర్చలు సాగనున్నాయి. వ్యాపార రంగ ప్రముఖులు, పెట్టుబడిదారులు, మార్గదర్శకులు, పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యక్షంగా అభిప్రాయాలు పంచుకునే అవకాశం కూడా కల్పించనున్నారు.
యువత ఉద్యోగాలు కోరే స్థాయిని దాటి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, సృజనాత్మక ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని డాక్టర్ ఎస్. ఆదినారాయణ పిలుపునిచ్చారు. దక్షిణ భారత రాష్ట్రాల యువ పారిశ్రామికవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వివరాలకు:
డా.ఎస్.ఆదినారాయణ
వ్యవస్థాపక అధ్యక్షులు
అదిలీలా ఫౌండేషన్, న్యూఢిల్లీ
మొబైల్: 9312200898
ఈ-మెయిల్: [email protected]
వెబ్‌సైట్: http://www.adileelafoundation.in
తాజా వార్తలు
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం







