భద్రతా సహకారంపై బహ్రెయిన్, సౌదీ అరేబియా చర్చలు..!!
- July 25, 2026
మనామా: భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసే విషయమై బహ్రెయిన్, సౌదీ అరేబియా చర్చలు జరిపాయి. సౌదీ–బహ్రెయిన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ పరిధిలోని సెక్యూరిటీ కమిటీ వర్కింగ్ గ్రూప్ ఏడో సమావేశం బహ్రెయిన్‌లో జరిగింది. ఈ సమావేశానికి బహ్రెయిన్ తరఫున డిప్యూటీ చీఫ్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ మేజర్ జనరల్ డాక్టర్ షేక్ హమద్ బిన్ మహ్మద్ అల్ ఖలీఫా అధ్యక్షత వహించారు. సౌదీ ప్రతినిధి బృందానికి సౌదీ హోం మంత్రిత్వ శాఖలోని లీగల్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ బిన్ సులేమాన్ అల్ ఈస్సా నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా మేజర్ జనరల్ డాక్టర్ షేక్ హమద్ మాట్లాడుతూ.. రెండు సోదర దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలకు అనుగుణంగా భద్రతా సహకారం మరింత బలోపేతం చేయడం అత్యంత కీలకమని అన్నారు. పరస్పర సహకారం ద్వారా భద్రతా రంగంలో ఉమ్మడి కార్యక్రమాలు వేగవంతమవడంతో పాటు ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ, ప్రాంతీయ భద్రత మరింత బలపడతాయని పేర్కొన్నారు.
సమావేశంలో సెక్యూరిటీ కమిటీ చేపట్టిన కార్యక్రమాల పురోగతి, ఇప్పటివరకు సాధించిన విజయాలను సమీక్షించారు. అలాగే ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని మరింత విస్తరించడం, కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు.
తాజా వార్తలు
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం
- వాణిజ్యం నుంచి లాజిస్టిక్స్ కారిడార్ల వరకు..విస్తరిస్తున్న భారత్-యూఏఈ ఆర్థిక భాగస్వామ్యం
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!







