సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- July 25, 2026
న్యూ ఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. విద్యావ్యవస్థలో పారదర్శకత లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీజేపీ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో పోరాటం సాగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లను ఆమోదించడంతో దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు చివరకు తెరపడింది.
నీట్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న విజ్ఞప్తి నెరవేరడంతో పాటు, ఇతర డిమాండ్లపైనా కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సీజేపీ(Neet Protest Called Off) ప్రతినిధులు చర్చలు జరిపారు. ఆందోళనల సందర్భంగా దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నిరసనకారులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేసేందుకు కేంద్రం ఒప్పుకుందని, నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందని సీజేపీ నాయకులు మీడియాకు వెల్లడించారు.
ఇదే విషయమై కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నిరసనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని, విద్యావ్యవస్థలోనూ, పరీక్షల నిర్వహణలోనూ సమూల మార్పులు తీసుకువస్తామని స్పష్టం చేశారు. అలాగే నీట్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్రం నుండి స్పష్టమైన హామీలు లభించడంతో తమ ఆందోళనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించి, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







