గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- July 25, 2026
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీ (ChatGPT) సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం నుంచి సర్వర్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా వెబ్, మొబైల్ యాప్స్ సేవలు నిలిచిపోవడంతో గ్లోబల్‌గా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ సర్వీసుల అంతరాయాలను ట్రాక్ చేసే ‘డౌన్‌డిటెక్టర్’ (Downdetector) కథనం ప్రకారం మధ్యాహ్నం 2:54 గంటల నుంచి ప్రధానంగా ఈ సమస్య మొదలైంది.
ప్రభావితమైన సేవలు & సమస్య వివరాలు
ఇది ఏ ఒక్క ప్రాంతానికో లేదా లోకల్ నెట్‌వర్క్‌కో సంబంధించిన సమస్య కాదని, ఓపెన్ఏఐ (OpenAI) గ్లోబల్ సర్వర్లలోనే సాంకేతిక లోపం తలెత్తిందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (iOS) మొబైల్ యాప్‌లతో పాటు వెబ్ ప్లాట్‌ఫామ్‌లో కూడా లాగిన్ సమస్యలు తలెత్తాయి. పాత చాట్స్ సెక్షన్ ఓపెన్ కాకపోవడం, డెవలపర్లు ఉపయోగించే API (Application Programming Interface) సర్వీసులు నిలిచిపోవడంతో పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు, డెవలపర్ల పనులకు ఆటంకం కలిగింది.
ఓపెన్ఏఐ (OpenAI) స్పందన
చాట్‌జీపీటీ సేవల్లో తలెత్తిన గ్లోబల్ అంతరాయం పై మాతృ సంస్థ ఓపెన్ఏఐ అధికారికంగా స్పందించింది. తమ సర్వర్లలో తలెత్తిన సమస్యను గురుతించామని, దానిపై ఇంజనీరింగ్ టీమ్ ఇప్పటికే పనిచేస్తోందని తెలిపింది.త్వరలోనే సమస్యను పరిష్కరించి సేవులను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కొత్త నిబంధనలు..!!
- బిగ్ టికెట్లో భారతీయుడిని వరించిన అదృష్టం..!!
- సౌదీ అరేబియాలో కీలక చమురు పైప్‌లైన్ మూసివేత..!!
- కువైట్ విదేశాంగ మంత్రితో ఖతార్ ప్రధాని ఫోన్లో కీలక చర్చలు..!!
- రాస్ అల్ ఖైమాలో బీచ్ బార్బెక్యూపై నిషేధం..!!
- కువైట్ తీరాలకు తరలివస్తున్న ఫ్లెమింగోలు..!!
- విద్యార్థుల రీయింబర్స్మెంట్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
- ఒమన్‌లో దారుణం.. తల్లిపై కత్తితో దాడి..!!
- హైదరాబాద్ కెప్టెన్ గా సిరాజ్
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు







