‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- July 25, 2026
భారతీయ వైద్యులు రూపొందించిన దేశీయ HTO ఇంప్లాంట్ ఆవిష్కరణ
మెడికవర్ హాస్పిటల్స్‌లో 28 ఏళ్ల యువ వైద్యుడికి విజయవంతమైన జాయింట్ ప్రిజర్వేషన్ శస్త్రచికిత్స
హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్ (Sironix) సంస్థ దేశంలోనే తయారు చేసిన హై టిబియల్ ఆస్టియోటమీ (HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు.28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్ (లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం మరియు మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు . దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు..
ఈ అత్యాధునిక శస్త్రచికిత్సను సీనియర్ జాయింట్ ప్రిజర్వేషన్ & స్పోర్ట్స్ ఇంజరీ సర్జన్ డా. రఘువీర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, ఈ దేశీయ HTO ఇంప్లాంట్ రూపకల్పనలో కూడా ప్రధాన పాత్ర పోషించడం విశేషం. మోకాలి కార్టిలేజ్ దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న 28 ఏళ్ల యువ వైద్యుడికి ఈ ఇంప్లాంట్‌ను విజయవంతంగా అమర్చారు. రోగికి *హై టిబియల్ ఆస్టియోటమీ (HTO)*తో పాటు ఆటోలాగస్ కాన్డ్రోసైట్ ఇంప్లాంటేషన్ (ACI) నిర్వహించి కార్టిలేజ్‌ను పునరుద్ధరించారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటూ సాధారణ జీవితంలోకి తిరిగి వస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా డా. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ, “మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు. 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు, ప్రారంభ లేదా మధ్యదశ ఆర్థరైటిస్‌తో బాధపడేవారు, క్రీడా గాయాలు, కార్టిలేజ్ దెబ్బతినడం లేదా మోకాలి అమరికలో లోపం ఉన్నవారిలో Joint Preservation Surgery అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. సరైన సమయంలో చికిత్స అందితే రోగి సహజ మోకాలినే 10 నుంచి 20 సంవత్సరాల వరకు కాపాడుకోవచ్చు. చాలామందిలో Knee Replacement అవసరాన్ని వాయిదా వేయడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో పూర్తిగా నివారించవచ్చు” అని తెలిపారు.
“హై టిబియల్ ఆస్టియోటమీ అనేది మోకాలి కింద ఉన్న టిబియా ఎముక అమరికను శాస్త్రీయంగా సరిచేసే ప్రక్రియ. దీనివల్ల శరీర బరువు దెబ్బతిన్న భాగంపై కాకుండా ఆరోగ్యకరమైన భాగంపై పడుతుంది. ఫలితంగా నొప్పి తగ్గుతుంది, ఆర్థరైటిస్ పురోగతి మందగిస్తుంది, సహజ మోకాలి పనితీరు ఎక్కువకాలం కొనసాగుతుంది. కేవలం కార్టిలేజ్‌ను చికిత్స చేయడం సరిపోదు; సమస్యకు మూలమైన ఎముకల అమరికను సరిచేయడమే Joint Preservation విజయానికి కీలకం” అని వివరించారు.
మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్ డా.శరత్ రెడ్డి మాట్లాడుతూ "భారతదేశంలోనే రూపుదిద్దుకున్న ఈ HTO ఇంప్లాంట్ విజయవంతంగా క్లినికల్ ప్రాక్టీస్‌లోకి రావడం దేశీయ వైద్యరంగానికి గర్వకారణం. ప్రపంచస్థాయి సాంకేతికతను భారతీయ రోగులకు అందుబాటు ధరల్లో అందించాలన్న 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యానికి ఇది నిదర్శనం. మెడికవర్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక జాయింట్ ప్రిజర్వేషన్ చికిత్సలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. ఈ దేశీయ సాంకేతికత వల్ల యువ రోగులు సహజ మోకాలినే ఎక్కువకాలం కాపాడుకునే అవకాశం పొందుతారు." అని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ మాజీ అధ్యక్షుడు ప్రొ. జివిఎస్ మూర్తి మాట్లాడుతూ, “భారతీయ వైద్యుల పరిశోధనతో రూపుదిద్దుకున్న ఈ HTO ఇంప్లాంట్ క్లినికల్ ప్రాక్టీస్‌లో విజయవంతంగా వినియోగించబడటం భారత ఆర్థోపెడిక్ రంగానికి గర్వకారణం. ‘మేక్ ఇన్ ఇండియా’ ఆవిష్కరణలు ప్రపంచస్థాయి నాణ్యతను అందుకుంటున్నాయనే దానికి ఇది నిదర్శనం. యువ రోగుల్లో సహజ మోకాళ్లను పరిరక్షించే చికిత్సలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది” అని అన్నారు.
చివరగా డా. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రతి మోకాలి నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రారంభ దశలోనే ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించి MRI, Alignment Evaluation, Cartilage Assessment వంటి పరీక్షలు చేయించుకుంటే ఆధునిక Joint Preservation చికిత్సలతో సహజ మోకాలినే ఎక్కువకాలం కాపాడుకోవచ్చు. ప్రతి రోగి తన సహజ మోకాలితోనే ఆరోగ్యంగా, చురుకుగా జీవించేలా చేయడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.
ఈ వివరాలను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డా.రఘువీర్ రెడ్డి, ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, డాక్టర్ శరత్ రెడ్డి-మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్, ప్రొఫెసర్ జి.వి.ఎస్ మూర్తి-తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ మాజీ అధ్యక్షుడు , ఆర్థోపెడిక్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు చికిత్స పొందిన యువ వైద్యుడు వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా







