స్వాతంత్య్రదిన వేడులకు ముస్తాబైన ఢిల్లీ
- August 14, 2016
70వ స్వాతంత్య్ర దిన వేడుకలకు దేశ రాజధాని దిల్లీ నగరం సిద్ధమైంది. ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దిల్లీలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. నిఘా నేత్రాలను మరింత పటిష్ట పరిచేందుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా స్పష్టంగా చూపించగలిగే హై రిజల్యూషన్ కెమెరాలను రూ.2కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రదిన వేడుకల ప్రాంగణం వద్ద ఐదువేల మంది దిల్లీ పోలీసులు సహా కేంద్ర భద్రతా దళాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ దళాలు పహారా కాస్తున్నారు. ఎర్రకోటలోని చిన్న గదులు, కిటికీలు వంటివి దాదాపు 1800 ప్రదేశాలను భద్రతా దళాలు మూసేశాయి. ప్రధాని ఎర్రకోటకు వచ్చే మార్గంలో 50పీసీఆర్ వాహనాలు గస్తీ కాస్తున్నాయి. సందర్శకుల కోసం ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







