దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!

- July 27, 2026 , by Maagulf
దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!

దుబాయ్: దుబాయ్ డేట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న రైతులు, నిర్వాహకులకు Dh1 మిలియన్ గ్రాంట్ మంజూరు చేయాలని దుబాయ్ యువరాజు, ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. యూఏఈ జాతీయ వారసత్వాన్ని పరిరక్షించడం, ఖర్జూర సాగు సంప్రదాయాన్ని ప్రోత్సహించడంలో వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ తెలిపింది.

దుబాయ్-అల్ ఐన్ రోడ్డులోని ఖలాత్ అల్ రిమాల్ వేదికగా నిర్వహించిన మూడో దుబాయ్ డేట్ ఫెస్టివల్ జూలై 26తో ముగిసింది. ఈ ఉత్సవంలో ఖర్జూర చెట్టు, దాని సాగును ప్రోత్సహించే 15 పోటీలు నిర్వహించారు. ఈ ఏడాది కొత్త విభాగాలను కూడా ప్రవేశపెట్టారు. రైతులు, కుటుంబాలు, వివిధ సంస్థలు కలిసి ఎమిరాటి వారసత్వాన్ని ఘనంగా జరుపుకునే వేదికగా ఈ ఉత్సవం నిలిచింది.

5 వేల కుటుంబాలకు తాజా ఖర్జూరాల పంపిణీ
డేట్ ఫెస్టివల్ ముగిసినా ఖర్జూరాల కోత సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో, దుబాయ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (CDA)..'ఖరాయెఫ్ అల్ రుతాబ్' కార్యక్రమం రెండో విడతను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా దేశీయ వ్యవసాయ క్షేత్రాల సహకారంతో, 1,000 మంది ఎమిరాటి వాలంటీర్ల భాగస్వామ్యంతో 5,000కు పైగా కుటుంబాలు మరియు ఇతర లక్ష్య వర్గాలకు తాజా ఖర్జూరాల పెట్టెలను పంపిణీ చేయనున్నారు. స్థానికంగా పండించిన వ్యవసాయ ఉత్పత్తులను సమర్థంగా వినియోగించడంతో పాటు, సీజనల్ పంటల ద్వారా సామాజిక, మానవతా సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com