ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- July 27, 2026
దోహా: ఖతార్‌లో నిబంధనలను పాటించని ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) కఠిన చర్యలు చేపట్టింది. ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం ఆధ్వర్యంలో రెండు ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలను పరిపాలనా పరంగా మూసివేయడంతో పాటు మరో 10 ఏజెన్సీల నమోదును రద్దు చేసింది. విమాన రవాణా రంగంలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఆయా ఏజెన్సీలు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు QCAA వెల్లడించింది.
ఈ సందర్భంగా అన్ని ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలు అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. సంబంధిత అధికార విభాగం నుంచి అవసరమైన లైసెన్సులు పొందకుండా ట్రావెల్ లేదా ఎయిర్ కార్గో సేవలు నిర్వహించరాదని హెచ్చరించారు. 2025 నాటి చట్టం నంబర్-3లోని ఆర్టికల్-3 ప్రకారం అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహించే సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







