జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!

- July 27, 2026 , by Maagulf
జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!

మస్కట్: క్వాలిటీ ఆఫ్ లైఫ్ పరంగా ఒమన్ ఆసియాలోనే అత్యుత్తమ దేశంగా నిలిచింది. నంబియో (Numbeo) క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2026 మధ్యంతర నివేదిక ప్రకారం ఒమన్ ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానం దక్కించుకుంది. ఈ సూచీలో ఒమాన్ 203.9 పాయింట్లతో డెన్మార్క్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచింది. 205.6 పాయింట్లతో నెదర్లాండ్స్ తొలి స్థానంలో, 204.8 పాయింట్లతో లక్సెంబర్గ్ రెండో స్థానంలో ఉన్నాయి. ఆసియా దేశాల జాబితాలో ఒమన్ తొలి స్థానంలో నిలవగా, ఖతార్ రెండో, జపాన్ మూడో స్థానాలను దక్కించుకున్నాయి.

జీవన నాణ్యతను అంచనా వేయడానికి కొనుగోలు శక్తి, ప్రజా భద్రత, ఆరోగ్య సేవల నాణ్యత, జీవన వ్యయం, ఆస్తి ధరలు-ఆదాయ నిష్పత్తి, ట్రాఫిక్‌లో ప్రయాణ సమయం, కాలుష్య స్థాయిలు, వాతావరణ పరిస్థితులు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఒమాన్‌లో ఉన్నత స్థాయి ప్రజా భద్రత, తక్కువ కాలుష్యం, మెరుగైన వైద్య సేవలు, అనుకూల వాతావరణం, తక్కువ ప్రయాణ సమయం వంటి అంశాలు ఈ ర్యాంకింగ్‌లో అగ్రస్థానానికి చేరేందుకు దోహదపడ్డాయని నంబియో పేర్కొంది.

ప్రపంచంలోని దేశాలు, నగరాల జీవన పరిస్థితులను పోల్చి చూపే ప్రముఖ క్రౌడ్‌సోర్స్ డేటాబేస్‌లలో నంబియో ఒకటి. వినియోగదారులు అందించిన సమాచారం, గణాంకాల ఆధారంగా ఈ సూచీని కాలానుగుణంగా నవీకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా జీవన నాణ్యతపై అంచనాలను విడుదల చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com