ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- July 27, 2026
ఇస్రోలో ఉద్యోగాలు పడ్డాయి.. అర్హతలు ఉన్నవారికి జాబ్ వచ్చే అవకాశాలెక్కువ..ఇస్రోలో జాబ్ కొట్టారంటే నెలకు రూ.25వేలపైనే జీతం వస్తుంది. చాలామందికి అంతరిక్ష రంగంలో ఉద్యోగం చేయాలని ఉంటుంది.
అలాంటి అభ్యర్థుల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అద్భుతమైన ఛాన్స్ ఇస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ రేంజ్లో వివిధ కేంద్రాలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో ఖాళీ అయిన పే మ్యాట్రిక్స్ లెవల్-4 పోస్టుల భర్తీకి ఇస్రో షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఈ ప్రాసెస్ ద్వారా మొత్తం 244 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉంటే అభ్యర్థులు 2026 జులై 27 నుంచి ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టుల్లో హైదరాబాద్‌లోని ఇస్రో కేంద్రాల్లో 15 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట కేంద్రంలో 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టుల వారీగా ఖాళీలివే:
* అసిస్టెంట్ పోస్టులు : 130
* జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు : 81
* అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) పోస్టులు : 22
* స్టెనోగ్రాఫర్ పోస్టులు : 10
* జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు : 1
విద్యార్హతలివే:
అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) పోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థులు ఏదైనా కేటగిరీలో డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. అంతేకాదు.. కంప్యూటర్‌పై ఎక్కువగా అవగాహన ఉండాలి స్టెనోగ్రాఫర్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ లేదా కమర్షియల్, సెక్రటేరియల్ ప్రాక్టీస్‌లో డిప్లొమా అర్హత కూడా ఉండాలి. స్టెనో-టైపిస్ట్, స్టెనోగ్రాఫర్‌గా కనీసం ఒక ఏడాది ఎక్స్ పీరియన్స్ కూడా తప్పనిసరి. ఇంగ్లిష్ స్టెనోగ్రఫీ, కంప్యూటర్ పరిజ్ఞానం మస్ట్ గా ఉండాలి.
వయస్సు:
అభ్యర్థుల వయసు 2026 ఆగస్టు 16 నాటికి గరిష్ఠంగా 28 ఏళ్లు నిండి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు ఎంత?
అభ్యర్థులకు అర్హత ఉంటే.. 2026 ఆగస్టు 16లోపు ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. జనరల్ (G) కేటగిరీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
శాలరీ ఎంతంటే?
ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్-4 ప్రకారం.. ప్రారంభ జీతం నెలకు రూ.25,500 ఉంటుంది. అదనంగా నిబంధనల ప్రకారమే ఇతర అలవెన్సులు అందుతాయి. అంతరిక్ష పరిశోధనా రంగంలో కెరీర్ కోరుకునేవారికి ఇదే అద్భుతమైన అవకాశం. ఆసక్తి, అర్హత ఉంటే అభ్యర్థులు తుది గడువు అప్లయ్ చేసుకోవడం బెటర్.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







