రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- July 28, 2026
కువైట్ సిటీ: రోడ్డుపై చెడిపోయిన వాహనాలను అలాగే వదిలేస్తే వాటిని స్వాధీనం చేసుకుంటామని కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. అలాగే వాహన యజమానులపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు చేసి జరిమానాలు కూడా విధిస్తామని ట్రాఫిక్ అవగాహన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కర్నల్ అబ్దుల్లా బు హస్సన్ స్పష్టం చేశారు. వాహనం చెడిపోతే వీలైనంత వరకు రహదారి కుడి అంచుకు తరలించి, హజార్డ్ లైట్లు ఆన్ చేయాలని, వార్నింగ్ ట్రయాంగిల్ ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా టోయింగ్ వాహనం ద్వారా తరలించాలని సూచించారు. రోడ్డుపై చెడిపోయిన వాహనాన్ని వదిలేయడం ప్రజల భద్రతకు ముప్పుగా మారడంతో పాటు ప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతుందన్నారు.
ప్రస్తుతం నిర్వహణ పనుల కారణంగా అల్-మఘ్రిబ్ రోడ్, బయాన్ ప్యాలెస్ సమీపంలోని కింగ్ ఫహద్ రోడ్ సహా పలు ప్రధాన రహదారుల్లో తాత్కాలికంగా మార్పులు, మూసివేత ఆంక్షలు అమల్లో ఉన్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ సూచనలను పాటిస్తూ, పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని కోరారు.సెలవుల సీజన్ నేపథ్యంలో విదేశాలకు రోడ్డు మార్గంలో వెళ్లే వాహనదారులు తమ వాహనాలు రోడ్డు ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయో లేదో, రిజిస్ట్రేషన్ చెల్లుబాటులో ఉందో, టైర్లు, బ్రేకులు, ఇంజిన్ ఆయిల్, కూలెంట్ వంటి అంశాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించారు.
జీసీసీ దేశాలకు ప్రయాణించేందుకు చెల్లుబాటు అయ్యే కువైట్ డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతుందని, అయితే జీసీసీ వెలుపల దేశాలకు వెళ్లేవారు తప్పనిసరిగా అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ పొందాలని తెలిపారు. ట్రాఫిక్ జరిమానాలు బకాయిలుగా ఉన్న ప్రవాసులు కువైట్ విడిచి వెళ్లేందుకు అనుమతి ఉండదని, ప్రయాణానికి ముందు అన్ని జరిమానాలను చెల్లించి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కర్నల్ అబ్దుల్లా బు హస్సన్ సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!







