ఖతార్‌లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- July 28, 2026
దోహా: ఖతార్ జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ అధికారులు సముద్ర మార్గం ద్వారా దేశంలోకి అక్రమంగా పొగాకు ఉత్పత్తులను తరలించే యత్నాన్ని అడ్డుకున్నారు. దోహా పోర్టు మరియు నార్తర్న్ పోర్ట్స్ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఓ నౌకలో రహస్యంగా దాచిన 1,650 కిలోల నమిలే పొగాకుతో పాటు 22,005 సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం, సుంకాలను ఎగవేయడంతో పాటు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నౌకలో ప్రత్యేకంగా రూపొందించిన రహస్య అరల్లో ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తులను దాచినట్లు గుర్తించారు.ఈ ఘటన ఖతార్ కస్టమ్స్ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ రవాణా యత్నమని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకుపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!







