డబ్బింగ్ దశలో 'ఆక్సిజన్'

- August 14, 2016 , by Maagulf
డబ్బింగ్ దశలో 'ఆక్సిజన్'

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా. నిర్మాత ఎస్‌.ఐశ్వర్య మాట్లాడుతూ ''గోపీచంద్ హీరోగా మేం రూంపొందిస్తున్నాఆక్సిజన్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇప్పటి వరకు సినిమా 90 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అలాగే చిత్రీకరణకు సమాంతరంగా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ పాయింట్‌తో సినిమా చేస్తున్నాం. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్ గా ఉంటుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది. సెప్టెంబర్ నెలలో ఆడియో విడుదల చేసి అదే నెలలో సినిమాను కూడా ప్రేక్షకులు ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నాం" అన్నారు. గోపీచంద్‌, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, ,కిక్‌ శ్యామ్‌, ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీ షిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌:పీటర్ హెయిన్, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com