తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- July 29, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో తైవాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధుల బృందం బుధవారం రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సమావేశంలో తైవాన్‌కు చెందిన డెల్టా ఎలక్ట్రానిక్స్, బెన్ క్యూ, సీబీటీసీ బ్యాంక్, డైమెర్కో, మాస్టర్ హిల్, నాన్ పావో రెసిన్స్, ఎవర్ క్లియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, షెంగ్ హుయ్ టెక్, టెక్ టాప్ ఇంజనీరింగ్, కేఎస్ టెర్మినల్స్, శాండ్ సన్, జిలీ కనస్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్, కపెల్లా స్టోర్స్ వంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల గురించి ప్రతినిధులకు వివరించారు. ముఖ్యంగా పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, జాతీయ రహదారులతో కూడిన బలమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్, రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన తయారీ రంగ ఎకోసిస్టమ్ పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు.
అలాగే ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్లు, సమాచార సాంకేతికత (ఐటీ), అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్‌తో పాటు ఎగుమతి ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం పేర్కొన్నారు.
పెట్టుబడిదారులకు విధానపరమైన స్థిరత్వం, వేగవంతమైన అనుమతులు, పూర్తి స్థాయి ప్రభుత్వ సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశం ద్వారా తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్‌తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్‌లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్‌లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్‌లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







