షేర్డ్ హౌజింగ్.. భద్రతా నిబంధనలపై సౌదీ హెచ్చరిక..!!
- July 30, 2026
రియాద్: షేర్డ్ హౌజింగ్ నిర్వహిస్తున్న యజమానులు, నిర్వాహకులు తాజా ఆరోగ్య, సాంకేతిక భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సౌదీ అరేబియా మున్సిపాలిటీ, హౌసింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నివాసితులకు సురక్షితమైన వాతావరణం కల్పించడం, అత్యవసర పరిస్థితులకు ఎప్పుడూ సిద్ధంగా ఉండటం వారి బాధ్యత అని స్పష్టం చేసింది.
ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, ఖాళీ చేసే దారులు ఎప్పుడూ అడ్డంకులు లేకుండా ఉండాలని సూచించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా పనిచేసే అత్యవసర లైటింగ్ వ్యవస్థలు, వెలుగులు ఇచ్చే దిశా సూచిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది. అత్యవసర తలుపులు లోపల నుంచి సులభంగా తెరుచుకునే విధంగా ఉండాలని ఆదేశించింది.
అలాగే అగ్నిప్రమాదాలను గుర్తించే వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలను నిరంతరం తనిఖీ చేసి, సక్రమంగా నిర్వహించాలని తెలిపింది. నివాస భవనాలు, కారిడార్లు, ఎగ్జిట్ మార్గాల్లో ఎలాంటి వస్తువులను స్టోర్ చేయరాదని హెచ్చరించింది. అనుమతించిన సామర్థ్యానికి మించి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఉద్యోగదాతలు, వసతిగృహాల నిర్వాహకులు అధికారికంగా ఆమోదించిన అత్యవసర తరలింపు (ఎవాక్యుయేషన్) ప్రణాళికలను సిద్ధం చేయాలని, భవనాల్లో స్పష్టంగా కనిపించే చోట్ల ఎవాక్యుయేషన్ మ్యాప్‌లు, అత్యవసర ఎగ్జిట్ రూట్స్, సురక్షిత సమావేశ ప్రాంతాల వివరాలను డిస్ ప్లే మంత్రిత్వ శాఖ సూచించింది. నివాసితులందరికీ అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అవగాహన కల్పించాలని పేర్కొంది. తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, ప్రాథమిక అగ్నిమాపక పరికరాల వినియోగంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది.
భద్రతా నిబంధనలను పాటించడం కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదని, ప్రమాదాలను నివారించి ప్రాణాలను రక్షించే సామాజిక బాధ్యత కూడా అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తొలి నిమిషాల్లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఆగస్టు నెలకు యూఏఈలో కొత్త ఇంధన ధరలు ప్రకటింపు..
- బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం..ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు!
- సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో భారీ ప్రాజెక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ..!!
- మస్కట్‌లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్‌కు విమానాలు రద్దును పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- స్లిమ్మింగ్ ఉత్పత్తిపై ఖతర్ ఆరోగ్య శాఖ హెచ్చరిక..!!
- మహిళ జీతం క్లెయిమ్‌ను తిరస్కరించిన బహ్రెయిన్ కోర్టు..!!
- దుబాయ్ జనాభా 47.41 లక్షలు..1.61 లక్షల మంది కొత్త నివాసితులు..!!
- అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడల ముగింపు వేడుక.. ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్







