అల్ జబల్ అల్ అఖ్దర్‌లో కొత్త 8-KM రోడ్ ప్రారంభం..!!

- July 30, 2026 , by Maagulf
అల్ జబల్ అల్ అఖ్దర్‌లో కొత్త 8-KM రోడ్ ప్రారంభం..!!

మస్కట్: ఒమన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అల్ జబల్ అల్ అఖ్దర్ లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మరో కీలక అడుగు పడింది. సియా–కుత్నా (Siya–Qutnah) రహదారిలో అభివృద్ధి చేసిన 8 కిలోమీటర్ల మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రవాణా, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MTCIT) తెలిపింది.

మొత్తం 9 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ 8 కి.మీ మార్గాన్ని వాహనాల రాకపోకల కోసం తెరిచారు. ఈ రహదారి డుసిట్ హోటల్ ఎదురుగా ఉన్న అల్ జబల్ అల్ అఖ్దర్ ప్రధాన రహదారి నుంచి ప్రారంభమై, షనూత్ మీదుగా అల్ మఖ్బ్ ప్రాంతం వరకు విస్తరించింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రహదారిపై స్టీల్ గార్డ్‌ రైల్స్, కాంక్రీట్ బ్యారియర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ ప్రాజెక్టుతో అల్ జబల్ అల్ అఖ్దర్‌లోని పర్యాటక ప్రాంతాలు, నివాస ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభం, సురక్షితం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. దీంతో పర్యాటక రంగానికి ఊతం లభించడంతో పాటు, స్థానిక ప్రజలు, సందర్శకుల ప్రయాణ సమయం కూడా తగ్గుతుందన్నారు.

దేశంలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్డు భద్రత పెంపు, కీలక పర్యాటక మరియు నివాస ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం కల్పించడం ద్వారా ఆర్థికాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com