ఖతార్ టాయ్ ఫెస్టివల్ 2026కు గడువు పొడిగింపు..!!
- July 30, 2026
దోహా: విశేష స్పందన నేపథ్యంలో ఖతార్ టాయ్ ఫెస్టివల్ 2026 నిర్వహణ గడువును ఆగస్టు 4 వరకు పొడిగించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఖతార్ క్యాలెండర్ ఆధ్వర్యంలో, స్పేస్టూన్ గ్రూప్ సహకారంతో ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.
దోహాలోని దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో జరుగుతున్న ఈ ఫెస్టివల్లో పిల్లలు, కుటుంబాల కోసం అనేక ఆకర్షణలు ఏర్పాటు చేశారు. స్టూడియోస్, ఇన్‌ఫ్లేటబుల్స్, యంగ్ అడల్ట్, కిడ్స్, ప్రీ-స్కూల్ జోన్లతో పాటు ప్రధాన వేదికపై ప్రతిరోజూ వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఏడాది పొడవునా నివాసితులు, పర్యాటకులకు వైవిధ్యమైన వినోద కార్యక్రమాలను అందించాలన్న విజిట్ ఖతార్ లక్ష్యంలో భాగంగానే ఈ టాయ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. కుటుంబ వినోదం, భారీ ఈవెంట్ల నిర్వహణలో ఖతార్‌ను ప్రముఖ గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆపదలో ఉన్న వేలాది మందికి అండగా GDRFA దుబాయ్..
- తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..
- దక్షిణ ఇరాన్ పై విరుచుకపడ్డ అమెరికా వైమానిక దళం!
- ఖతార్ టాయ్ ఫెస్టివల్ 2026కు గడువు పొడిగింపు..!!
- జాబ్ కోసం ప్రభుత్వ ఉద్యోగికి లంచం.. ముగ్గురికి రెండేళ్ల జైలుశిక్ష..!!
- మచిలీపట్నం పేరుతో భారత నౌకాదళ అత్యాధునిక నౌక..ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం
- ఆగస్టు 5 నుంచి ప్లాస్టిక్ క్యాప్‌లు లేని ఎల్పీజీ సిలిండర్లు.. KNPC
- అల్ జబల్ అల్ అఖ్దర్లో కొత్త 8-KM రోడ్ ప్రారంభం..!!
- షేర్డ్ హౌజింగ్.. భద్రతా నిబంధనలపై సౌదీ హెచ్చరిక..!!
- యూఏఈలో ఆగస్టు 3 వరకు వర్షాలు..!!







