హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం...
- July 30, 2026
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఈరోజు ఉదయం నుంచి ఆకస్మికంగా వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి కేపీహెచ్ బీ మూసాపేట్ జేఎన్టీయూ బాచుపల్లి నిజాంపేట్ పరిసరాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉండి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో ఉక్కపోత నుంచి నగర ప్రజలకు ఉపశమనం లభించింది. పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో కొంత ఇబ్బంది ఎదురైంది.
రోడ్ల పై చేరిన వరద నీరు ట్రాఫిక్ సమస్యలు
కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలలో నీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కూకట్ పల్లి మూసాపేట్ మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఆఫీస్ వేళల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణం చేసే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఉపరిద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







