దుబాయ్ మెట్రో బ్లూ లైన్‌తో మరింత విస్తరించనున్న రవాణా వ్యవస్థ..
- July 30, 2026
దుబాయ్: దుబాయ్ ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న దుబాయ్ మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్టు నగరంలోని ప్రధాన నివాస ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు, షాపింగ్ హబ్‌లు, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య వేగవంతమైన అనుసంధానాన్ని అందించనుంది.
ఈ కొత్త మెట్రో మార్గం ప్రారంభమైతే నగరంలో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రజా రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా రోజువారీ ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.
దుబాయ్ మెట్రో బ్లూ లైన్ ద్వారా అల్ జద్దాఫ్, అల్ రషీదియా, అల్ వార్కా, దుబాయ్ క్రీక్ హార్బర్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, మిర్దిఫ్, ఇంటర్నేషనల్ సిటీ, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ వంటి కీలక ప్రాంతాలు మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలోని నివాస, వాణిజ్య, వ్యాపార ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, ట్రాఫిక్ రద్దీ తగ్గడం, పర్యావరణహిత రవాణాకు ప్రోత్సాహం లభించనుంది.
దుబాయ్ ప్రభుత్వం స్మార్ట్ మొబిలిటీ లక్ష్యాల్లో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో దుబాయ్‌ను అత్యాధునిక రవాణా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగుగా నిలవనుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







