సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!

- July 31, 2026 , by Maagulf
సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!

రియాద్: అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉన్న లోపం గుర్తించడంతో 6,574 బీఎండబ్ల్యూ (BMW) కార్లను సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ రీకాల్ చేసింది.ఈ రీకాల్ 2023 నుంచి 2025 మోడల్ సంవత్సరాలకు చెందిన BMW 5 సిరీస్, BMW 7 సిరీస్ వాహనాలకు వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. డ్రైవర్ సీటులోని వైరింగ్ హార్నెస్‌లో లోపం కారణంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, పొగ రావడం లేదా వాహనంలో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

వాహన యజమానులు తమ వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VIN) ద్వారా తమ కారు రీకాల్ పరిధిలో ఉందో లేదో Recalls.sa వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవాలని సూచించారు. రీకాల్ పరిధిలో ఉన్న వాహనాల యజమానులు మొహమ్మద్ యూసుఫ్ నాగి కంపెనీని సంప్రదించి, అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయించుకోవాలని సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com