'టాక్సిక్' నుంచి కియారా అద్వానీ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
- August 01, 2026
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న 'టాక్సిక్' నుంచి కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్, కియారా బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
అద్భుతమైన డిజైన్‌తో రూపొందించిన ఎరుపు రంగు దుస్తుల్లో కియారా అద్వానీ ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆమె చూపులు, బోల్డ్ రూబీ లిప్స్, రాయల్ లుక్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గ్లామర్‌కే పరిమితం కాకుండా, 'నాదియా' పాత్రలో కాన్ఫిడెన్స్, మిస్టరీ దాగి ఉన్న పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
'టాక్సిక్' చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ అంచనాలు ఉన్నాయి చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







