దుబాయ్‌లో ఘనంగా గ్లోబల్ దీపావళి వేడుకలు.. ఏడు దేశాల భాగస్వామ్యం
- November 03, 2026
5 వేల మందికి పైగా హాజరు.. 14 రాష్ట్రాల సంప్రదాయ జానపద నృత్యాలు, 90కి పైగా బృందాలతో రంగోలి పోటీలు.. అనూప్ శంకర్ సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణ
దుబాయ్: భిన్న సంస్కృతులు.. విభిన్న దేశాలు.. ఒకే పండుగ.. ఒకే స్ఫూర్తి అనే సందేశంతో దుబాయ్‌లో గ్లోబల్ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. FOI ఈవెంట్స్, భారత కాన్సులేట్ జనరల్ సహకారంతో అల్ ఖుసైస్‌లోని అమిటీ స్కూల్లో ఈ వేడుకలను నిర్వహించింది. 'వన్ ఫెస్టివల్, మెనీ కల్చర్స్, వన్ స్పిరిట్' (ఒకే పండుగ.. ఎన్నో సంస్కృతులు.. ఒకే స్ఫూర్తి) అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమం వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది.
ఈ వేడుకల్లో సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, మలేషియా, థాయ్‌లాండ్, మారిషస్ దేశాలు భాగస్వాములుగా పాల్గొన్నాయి. ఆయా దేశాల కాన్సుల్ జనరల్స్‌తో పాటు యూఏఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ (CDA), విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA), దుబాయ్ కేర్స్‌కు చెందిన ప్రముఖ ప్రతినిధులు, సీనియర్ దౌత్యవేత్తలు, వివిధ దేశాల దౌత్య కార్యాలయాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారతీయ ప్రవాసులతో సహా 5,000 మందికి పైగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
భారతదేశంలోని 14కు పైగా రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ జానపద నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే 90కి పైగా బృందాలు పాల్గొన్న రంగోలి పోటీలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ రంగులతో కళాత్మకంగా రూపొందించిన రంగోలి చిత్రాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పాయి.
ప్రముఖ గాయకుడు అనూప్ శంకర్ అందించిన ప్రత్యక్ష సంగీత ప్రదర్శన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆయన పాటలు కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.
దీపావళి కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, దేశాలు, మతాలు, సంస్కృతులకు అతీతంగా ప్రజలను ఏకం చేసే గొప్ప సందేశమని ఈ వేడుకలు చాటి చెప్పాయి. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి.. శాంతి, స్నేహం, సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం వంటి విశ్వజనీన విలువలను ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
వివిధ దేశాల ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని పండుగను జరుపుకోవడం ద్వారా సాంస్కృతిక మార్పిడి,పరస్పర అవగాహన, అంతర్జాతీయ స్నేహసంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. యూఏఈలోని బహుళ సాంస్కృతిక సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వానికి ఈ గ్లోబల్ దీపావళి వేడుకలు అద్దం పట్టాయి.





తాజా వార్తలు
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!
- అర్ధరాత్రి 2.30 వరకు షోలు..చిత్రసీమ కు CM విజయ్ గుడ్ న్యూస్
- మిడ్ టర్మ్ ఎన్నికలు.. అమెరికాలో మొదలైన పోలింగ్
- సైబర్ నేరాల కట్టడికి రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకం: డీజీపీ సీవీ ఆనంద్
- విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి ఎన్నిక!
- దుబాయ్‌లో ఘనంగా గ్లోబల్ దీపావళి వేడుకలు.. ఏడు దేశాల భాగస్వామ్యం
- మక్కా ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన సంకీర్ణ దళాలు
- ఇరాన్‌లోని పరారీలో ఉన్న ఉగ్రవాదులకు సహకారం..ముగ్గురికి జీవిత ఖైదు
- QRCS షెల్టర్ ప్రాజెక్టు.. 704 కుటుంబాలకు లబ్ధి..!!







