పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..

- August 02, 2026 , by Maagulf
పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..

మస్కట్: విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఒమాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయుల నివాస చట్టం (Foreigners' Residence Law) అమలు నిబంధనల్లో సవరణలు చేస్తూ, ఎంపిక చేసిన దేశాల పౌరులకు ఉచితంగా 14 రోజుల టూరిస్ట్ వీసా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ మార్పులను రాయల్ ఒమాన్ పోలీస్ నిర్ణయం నం.109/2026 ద్వారా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ కస్టమ్స్ లెఫ్టినెంట్ జనరల్ హసన్ బిన్ మొహ్సిన్ అల్ ష్రైఖీ ప్రకటించారు. అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన మరుసటి రోజు నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

కొత్త నిబంధనల ప్రకారం, సంబంధిత అధికార సంస్థ నిర్ణయించిన అర్హత గల దేశాల పౌరులకు 14 రోజుల ఉచిత టూరిస్ట్ వీసా జారీ చేయవచ్చు. అయితే, ఈ వీసా మంజూరుకు సంబంధించిన షరతులను సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు.

అలాగే, ఈ 14 రోజుల ఉచిత వీసా గడువు ముగిసేలోపు, అవసరమైతే దానిని ఇతర టూరిస్ట్ వీసా కేటగిరీలుగా మార్చుకునే అవకాశం కూడా కల్పించారు. ఇందుకు ఆయా వీసాలకు వర్తించే నిబంధనలు, ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కొత్త వీసా కేటగిరీని విదేశీయుల నివాస చట్టం అమలు నిబంధనల ఆర్టికల్-10లో చేర్చడంతో పాటు, ఆర్టికల్-29లోని ప్రవేశ వీసాల జాబితాలో కూడా పొందుపరిచారు. ఈ వీసాకు ఫీజు సున్నా ఒమానీ రియాల్స్ (0 OMR)గా నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com