ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి

- August 04, 2026 , by Maagulf
ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి

న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలో మంగళవారం నిర్వహించిన ఎన్‌డీఏ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మచిలీపట్టణం లోక్‌సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్తో ఎంపీ బాలశౌరి సమావేశమయ్యారు.పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ఈ ఎన్‌డీఏ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సంక్షేమ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.ఈ సమావేశంలో పలువురు ఎన్‌డీఏ ఎంపీలు పాల్గొని, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ విధానాల అమలుపై అభిప్రాయాలను పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com