జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!

- August 06, 2026 , by Maagulf
జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!

మనామా: ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు గల్ఫ్ సహకార మండలి (GCC), యూరోపియన్ పార్లమెంట్ దేశాలు ఉమ్మడి వైఖరితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని బహ్రెయిన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం పేర్కొంది. ఎంపీ అహ్మద్ సబాహ్ అల్ సల్లూమ్ నేతృత్వంలోని బృందం వర్చువల్‌గా నిర్వహించిన 10వ జీసీసీ-యూరోపియన్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొంది.

ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతను శాంతియుత దౌత్య పరిష్కారాల ద్వారా బలోపేతం చేయాలన్న బహ్రెయిన్ వైఖరిని ప్రతినిధి బృందం పునరుద్ఘాటించింది. ఇటీవల ప్రాంతీయ మౌలిక వసతులపై ఇరాన్ జరిపిన దాడులు ప్రాంతీయ స్థిరత్వం, అంతర్జాతీయ సముద్ర భద్రత, ప్రపంచ ఇంధన మార్కెట్లకు తీవ్ర ముప్పుగా మారాయని పేర్కొంది. ఈ సమావేశంలో జీసీసీ శాసన మండళ్లు, యూరోపియన్ పార్లమెంట్ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com