కువైట్‌లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!

- August 06, 2026 , by Maagulf
కువైట్‌లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!

కువైట్: అక్రమంగా గర్భస్రావాలు నిర్వహిస్తూ, గర్భస్రావ పిల్స్ ను డబ్బుల కోసం విక్రయించిన ఆరోపణలపై కువైట్‌లో పనిచేస్తున్న ఓ ఈజిప్టు ప్రవాస డాక్టర్ ని క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అధికారులు అరెస్ట్ చేశారు.

అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గైనకాలజిస్ట్ పనిచేస్తున్న ఈ డాక్టర్ తన ప్రైవేట్ క్లినిక్‌లో చట్టవిరుద్ధంగా గర్భస్రావాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేపట్టింది.  అధికారులు రహస్య ఆపరేషన్ నిర్వహించి, గర్భస్రావ పిల్స్ కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ.. డాక్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  అనంతరం డాక్టర్ నివాసంలో నిర్వహించిన తనిఖీల్లో 49 గర్భస్రావ పిల్స్, 115 సైకోట్రోపిక్ ట్యాబ్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

విచారణలో నిందితుడు ఆరోపణలను అంగీకరించినట్లు, అలాగే గర్భస్రావ పిల్స్ ను విదేశాల నుంచి అక్రమ మార్గంలో కువైట్‌కు తెప్పించినట్లు ఒప్పుకున్నాడని అధికారులు తెలిపారు. నిందితుడిపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com