బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!

- August 06, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!

మనామా: ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసి డిజిటల్ మార్పును వేగవంతం చేసే దిశగా బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. స్మాల్ బోట్స్, జెట్‌స్కీల కోసం రిమోట్ టెక్నికల్ తనిఖీ సేవను ప్రారంభించింది. ఈ కొత్త సర్వీస్ ద్వారా ఆరు సంవత్సరాల లోపు వయస్సు గల స్మాల్ బోట్స్, అన్ని జెట్‌స్కీల యజమానులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, నిర్దేశిత ఫీజులు చెల్లించి, స్మాల్ షిప్స్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్న అనంతరం వీడియో కాల్ ద్వారా తప్పనిసరి సాంకేతిక తనిఖీలను పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నది.

ఈ సర్వీస్ పూర్తిగా డిజిటల్ విధానంలో అందుబాటులోకి రావడంతో పాటు, వినియోగదారులకు మరింత సులభమైన ఇంటర్‌ఫేస్‌ను అందించారు. అలాగే అవసరమైన అనుమతులను 50 శాతం వరకు తగ్గించగా, సేవల అందజేత సమయాన్ని 25 శాతం మేర తగ్గించినట్లు పోర్ట్స్ అండ్ మారిటైమ్ వ్యవహారాల అండర్‌సెక్రటరీ బదర్ హుడ్ అల్ మహ్మూద్ తెలిపారు.  ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందించాలనే లక్ష్యంతో వినూత్న డిజిటల్ పరిష్కారాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com