షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!

- August 06, 2026 , by Maagulf
షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!

మనామా: నిర్వహణ పనుల కారణంగా ముహర్రక్ నుంచి మనామా వెళ్లే దిశలోని షేక్ ఈసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై కుడివైపు లేన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు బహ్రెయిన్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ సమన్వయంతో చేపడుతున్న ఈ నిర్వహణ పనులు ఆగస్టు 7 (శుక్రవారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 9 (ఆదివారం) ఉదయం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ సమయంలో ప్రయాణికులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com