ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్

- August 06, 2026 , by Maagulf
ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్

హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త, రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమానికి మార్గదర్శకుడైన ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా డీజీపీ సి.వి.ఆనంద్ నివాళులర్పించారు. పలు ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా డీజీపీ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చూపిన దూరదృష్టి, అచంచలమైన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన అందించిన మేధోపరమైన మార్గనిర్దేశం, ఉద్యమానికి ఇచ్చిన బలమైన పునాది ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com