ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- August 06, 2026
న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. 2021 నుంచి ఇప్పటివరకు ప్రధాని విదేశీ పర్యటనల కోసం మొత్తం రూ.557.51 కోట్లు వెచ్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. కోవిడ్ ప్రభావం ఉన్న 2021లో ఈ ఖర్చు రూ.36.11 కోట్లుగా ఉండగా, ఆ తర్వాత దౌత్య సంబంధాలు పెరగడంతో ప్రయాణాల వ్యయం క్రమంగా పెరుగుతూ 2025 నాటికి రూ. 180 కోట్లకు చేరుకుంది. ఇక ఈ ఏడాది (2026) ఇప్పటివరకు ఫ్రాన్స్ పర్యటన మినహా ఇతర పర్యటనలకు రూ.74.58 కోట్లు ఖర్చయినట్లు వెల్లడించింది. ఇందులో ఒక్క నార్వే పర్యటనకే గరిష్టంగా రూ.17.46 కోట్లు వెచ్చించినట్లు స్పష్టం చేసింది.
ఖర్చును సమర్థించుకున్న కేంద్రం: రూ.36.3 లక్షల కోట్ల ఎఫ్‌డీఐల రాక
అయితే, ప్రధాని విదేశీ పర్యటనలపై జరుగుతున్న వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమర్థించుకుంది. ఈ పర్యటనల ద్వారా భారత్‌కు దౌత్యపరంగా, ఆర్థికంగా అపార ప్రయోజనాలు చేకూరాయని వివరించింది. 2021 జూలై నుంచి ఇప్పటివరకు వివిధ దేశాలతో కీలకమైన రక్షణ, సాంకేతికత, వ్యాపార రంగాలలో మొత్తం 316 అవగాహనా ఒప్పందాలు (MoUs) కుదిరినట్లు తెలిపింది. అంతేకాకుండా, ఈ అంతర్జాతీయ పర్యటనలు మరియు వ్యూహాత్మక ఒప్పందాల ఫలితంగా దేశంలోకి దాదాపు 381.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 36.3 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ప్రవాహంగా వచ్చాయని కేంద్రం తన నివేదికలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్‌లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్‌లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







