'ది ప్యారడైజ్' మునుపెన్నడూ చూడని యాక్షన్ బ్లడ్ బాత్ టీజర్ రిలీజ్

- August 06, 2026 , by Maagulf
\'ది ప్యారడైజ్\' మునుపెన్నడూ చూడని యాక్షన్ బ్లడ్ బాత్ టీజర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక 'పాన్-వరల్డ్' చిత్రం 'ది ప్యారడైజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన లభించింది. పోస్టర్,  టైటిల్ గ్లింప్స్‌తో పాటు, చిత్రంలోని మొదటి పాట 'ఆయా షేర్'   బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దర్శకుడు శ్రీకాంత్ ఒడెల ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో, ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.SLV సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఎంతగానో ఎదురుచూస్తున్న ప్యారడైజ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. "ఇక నుంచి ఈ జాగా ఎవరిది... ఈ దేశం ఎవరిది?" అనే నాని పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను 'ది ప్యారడైజ్' ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. హై-వోల్టేజ్ యాక్షన్, రక్తం చిందించే బ్లడ్‌బాత్ సీక్వెన్స్‌లు, ఇంటెన్స్ విజువల్స్‌తో ప్రతి క్షణం గూస్‌బంప్స్ తెప్పించేలా సాగింది.

టీజర్‌లోని ప్రతి ఫ్రేమ్ భారీ స్థాయి విజువల్ గ్రాండియర్‌ను తలపిస్తుంది. ప్రతి షాట్‌లో శ్రీకాంత్ ఓడెల విజన్ గ్రాండ్ గా కనిపించింది. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని ఓ కొత్త ప్రపంచాన్ని ఈ టీజర్ ఆవిష్కరించింది.

నాని తన కెరీర్‌లో ఎన్నడూ కనిపించని రగ్డ్, ఫెరోషియస్ అవతార్‌లో ప్రేక్షకులను సర్ ప్రైజ్. జడలతో కనిపించిన ఆయన లుక్, కళ్లలోని క్రూరత్వం, బాడీ లాంగ్వేజ్, యాక్షన్‌లో చూపించిన ఇంటెన్సిటీ... ఇవన్నీ కలిసి ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే పాత్రను సూచిస్తున్నాయి.

చివర్లో "ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి..." అంటూ నాని చెప్పిన డైలాగ్ టీజర్‌కు పర్ఫెక్ట్ క్లైమాక్స్‌లా నిలిచింది. ఆ ఒక్క డైలాగ్‌తోనే థియేటర్లలో విజిల్స్, గూస్‌బంప్స్ ఖాయమనే ఫీలింగ్‌ను కలిగించింది.

దర్శకుడు శ్రీకాంత్ ఓడెల 'ది ప్యారడైజ్'  ఎంత డీటైల్డ్ ప్రపంచాన్ని సృష్టించారో ఈ టీజర్ స్పష్టంగా తెలియజేస్తోంది. విజువల్ డిజైన్, మేకింగ్, యాక్షన్ స్కేల్... ప్రతి అంశంలో ఆయన మరో మెట్టు ఎక్కినట్లు కనిపిస్తోంది.

మోహన్ బాబు పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయన పలికిన డైలాగ్ టీజర్‌లోని ఇంటెన్సిటీని మరింత పెంచింది.

కాయదు లోహర్, రాఘవ్ జుయాల్ పాత్రలు కూడా టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ ను మరోస్థాయికి తీసుకెళ్ళింది. థియేటర్లలో ఈ స్కోర్ మరో స్థాయి అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. SLV సినిమాస్ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి.

టీజర్ లో నాని నెవర్ బిఫోర్ అవతార్, గూస్‌బంప్స్ పుట్టించే విజువల్స్, శ్రీకాంత్ ఓడెల గ్రాండ్ విజన్ కలిసి సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తాయి.

పాన్-వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' సెప్టెంబర్ 24, 2026న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

నటీనటులు: నాని, మోహన్ బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: సిహెచ్ సాయి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com