‘హైలో హైలో హైలెస్సా’ సాంగ్ రిలీజ్
- August 08, 2026
ఆకట్టుకునే ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన పళ్ళబురుసు' టీమ్, ఇప్పుడు ‘హైలో హైలో హైలెస్సా’ అనే ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాట సంప్రదాయ జానపద శైలికి మోడరన్ బీట్‌లను జోడిస్తూ ఆకట్టుకుంటోంది.
పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాటకు సురేశ్ గంగుల సాహిత్యం అందించారు. శ్రీరామచంద్ర, లక్ష్మీ మేఘన తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు.
క్యాచీ బీట్స్, సంప్రదాయ సంగీత వాయిద్యాల ఫ్లేవర్, ఆకట్టుకునే విజువల్స్‌తో పాట ఆద్యంతం ఆకట్టుకుంది.
‘హైలో హైలో హైలెస్సా’ పాటలోని ఎనర్జీ, జానపద టచ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. చిత్రం ప్రమోషన్స్‌లో ఈ పాట మరో ఆకర్షణగా నిలిచింది.
ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న 'పళ్ళబురుసు' చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా, వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్.
'‘హైలో హైలో హైలెస్సా'తో 'పళ్ళబురుసు' ఆల్బమ్‌లో మరో సెలబ్రేషన్ సాంగ్ చేరింది.
‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







