'రంభ ఊర్వశి మేనక' టీజర్ ఆగస్ట్ 10న రిలీజ్
- August 08, 2026
గత కొన్నేళ్లుగా విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్, ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్ 'రంభ ఊర్వశి మేనక'తో సిద్ధమయ్యారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
"Comedy Goes Cosmic" అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ వినోదంతో మేళవించిన వినూత్న కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి పాట 'నా కంటి మీద కునుకే'కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ఆగస్ట్ 10న టీజర్ ని లాంచ్ చేయనున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ లో అల్లరి నరేష్ చిరునవ్వుతో కనిపించడం ఫీల్ గుడ్ వైబ్ ని తీసుకొచ్చింది.
ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, వీకే నరేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరందరూ తమదైన కామెడీ టైమింగ్‌తో సినిమాకు మరింత వినోదాన్ని అందించనున్నారు.
ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డిజైన్‌ను రూపొందించగా, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్.
'రంభ ఊర్వశి మేనక' చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: అల్లరి నరేష్, వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ
నిర్మాతలు: రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్
బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్
సంగీతం: చైతన్ భరద్వాజ్
డిఓపి: రాంరెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







