నేషనల్ మ్యూజియం సమీపంలో 1,800 మీటర్ల వాకింగ్ ట్రాక్..!!
- August 09, 2026
మనామా: నేషనల్ మ్యూజియం సమీపంలో 1,800 మీటర్ల పొడవైన వాకింగ్ వేను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు క్యాపిటల్ ట్రస్టీస్ బోర్డు వెల్లడించింది. ప్రస్తుత సెషన్లో తవాసుల్ ప్లాట్‌ఫామ్ ద్వారా బోర్డుకు మొత్తం 1,203 వినతులు అందినట్లు డిప్యూటీ చైర్‌వుమన్ ఖులూద్ అల్ ఖత్తాన్ తెలిపారు. గవర్నరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలు, నియోజకవర్గాల్లో 185 ఫీల్డ్ విజిట్లు నిర్వహించినట్లు చెప్పారు. 223 వినతులపై తదుపరి చర్యలు చేపట్టడంతో పాటు సంబంధిత అధికారులకు 299 అధికారిక లేఖలు పంపినట్లు వెల్లడించారు. బోర్డు పనితీరులో క్షేత్రస్థాయి పర్యటనలు కీలకంగా మారాయని అల్ ఖత్తాన్ తెలిపారు.
కేంద్ర మార్కెట్ల అభివృద్ధి, పబ్లిక్ పార్కుల నిర్వహణ, ఆధునీకరణ, మౌలిక వసతుల మెరుగుదల, పార్కింగ్ కొరత పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, పట్టణ సుస్థిరత వంటి అంశాలకు బోర్డు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. జుఫైర్ ప్రాంతంలో 120 కొత్త పార్కింగ్ స్థలాల ఏర్పాటుతోపాటు 43 పబ్లిక్ పార్కుల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమంలో పురోగతి సాధించినట్లు వెల్లడించారు. రాజధానిలోని పాత సౌక్ పునరాభివృద్ధి పనులతో పాటు సిత్రా, జిధాఫ్స్లోని కేంద్ర మార్కెట్ల అభివృద్ధిపైనా బోర్డు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులు ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు రాజధాని పట్టణ ప్రత్యేకతను, చారిత్రక గుర్తింపును కాపాడేందుకు దోహదపడతాయని తెలిపారు.
కింగ్ ఫైసల్ కార్నిష్ వరకు విస్తరించే వాటర్‌ఫ్రంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నేషనల్ మ్యూజియం సమీపంలో 1,800 మీటర్ల వాకింగ్ వే నిర్మాణం కూడా ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో ఉన్నట్లు అల్ ఖత్తాన్ వెల్లడించారు. ప్రజలు, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో బోర్డు తన పర్యవేక్షణ, సేవా బాధ్యతలను కొనసాగిస్తోందని అన్నారు. గవర్నరేట్ ప్రజల అవసరాలకు అనుగుణంగా మున్సిపల్ సేవలను అభివృద్ధి చేయడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, బహ్రెయిన్ విజన్ 2030కు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు అల్ ఖత్తాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!







