ఖతార్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు QR333 మిలియన్లు..!!
- August 09, 2026
దోహా: ఖతార్‌లో జూలై 26 నుంచి 30 వరకు జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీల విలువ QR333 మిలియన్లకు పైగా నమోదైంది. ఇందులో నివాస యూనిట్ల విక్రయాల విలువ సుమారు QR67 మిలియన్లుగా ఉంది. ఈ వివరాలను ఖతార్ న్యాయ మంత్రిత్వ శాఖ (MoJ) తాజా వారపు రియల్ ఎస్టేట్ బులెటిన్‌లో వెల్లడించింది. దోహాలో మొత్తం QR163 మిలియన్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం లావాదేవీల విలువలో దాదాపు సగానికి సమానమని పేర్కొన్నది. లావాదేవీల సంఖ్యలోనూ దోహానే ముందంజలో నిలిచింది. ఐదు రోజుల వ్యవధిలో దోహాలో 53 డీల్స్ నమోదయ్యాయి. మరోవైపు అల్ షమాల్ మున్సిపాలిటీలో కేవలం QR1 మిలియన్ విలువైన ఒకే ఒక లావాదేవీ నమోదైంది.
రెసిడెన్సీ యూనిట్ల విక్రయాల్లో ది పెర్ల్ ఐలాండ్ అత్యధిక కార్యకలాపాలను నమోదు చేసింది. అక్కడ 14 లావాదేవీల ద్వారా QR34 మిలియన్ల విలువైన విక్రయాలు జరిగాయి. మరోవైపు ఉమ్మ్ అల్ అమాద్లో రెండు డీల్స్ ద్వారా కేవలం QR3 మిలియన్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. మార్కెట్లోని అధిక విలువైన లావాదేవీలు దోహా, ది పెర్ల్ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కేంద్రీకృతమవుతున్నాయని తాజా గణాంకాలు తెలిపాయి. ఇక నివాస అవసరాల కోసం కేటాయించిన ప్రాపర్టీల విక్రయాలు మొత్తం QR67 మిలియన్లకు చేరుకోవడం ద్వారా అపార్ట్మెంట్లు, ఇతర నివాస యూనిట్లపై కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగుతోందని వెల్లడించారు. జూలై చివరి వారానికి సంబంధించిన తాజా గణాంకాలు ఖతార్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో దోహా, ది పెర్ల్ ప్రాంతాలు కీలకంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!
- ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!!
- అవయవ మార్పిడి చికిత్సల్లో కింగ్ ఫైసల్ హాస్పిటల్ అరుదైన ఘనత..!!
- ఖతార్‌లో రెండో దశ ఎలక్ట్రిక్ రోబోటాక్సీల ట్రయల్స్..!!
- యూఎన్ ఆరోపణలను ఖండించిన బహ్రెయిన్..!!
- యూఏఈలో ఆన్లైన్ సెల్లర్స్ కు కొత్త రూల్స్..!!
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు







