వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..
- August 09, 2026
విశాఖపట్నం: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన థియేటర్ల వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంలో అత్యాధునిక హంగులతో కూడిన ‘ఏఏఏ సినిమాస్’ (AAA Cinemas) మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు.
వైజాగ్‌లోని ఇనార్బిట్ మాల్ (Inorbit Mall) వేదికగా ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఏషియన్ సినిమాస్ తో కలిసి అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ విశాఖ సినీ ప్రియులకు ఒక సరికొత్త మరియు ప్రపంచస్థాయి సినిమా అనుభూతిని అందించనుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద ఎల్ఈడీ సినిమా స్క్రీన్ అని తెలుస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటి ఎల్ఈడీ ప్రొజెక్షన్ క్యూ-లక్సన్ స్క్రీన్‌ను ఇందులో అమర్చారు. మొత్తం 8 స్క్రీన్లతో, 1,556 సీటింగ్ సామర్థ్యంతో పాటు విఐపి అతిథుల కోసం ప్రత్యేకంగా ‘ఐకాన్ స్టార్ లాంజ్’ (ICON STAR Lounge) మరియు ’82 లాంజ్’లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్‌పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్‌లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్‌లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్‌లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







