సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- August 09, 2026
జెడ్డా: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రియాద్, దమ్మామ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. మక్కాలో 42, మదీనాలో 43, జెడ్డాలో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అబ్హాలో 30, తబూక్, జిజాన్‌లో 38, బురైదాలో 47, హైల్, సకాకాలో 42, అల్ బహాలో 29, అరార్లో 43, నజ్రాన్‌లో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
పలు ప్రాంతాల్లో వర్షాలు
జిజాన్, అసీర్, అల్ బహా, మక్కా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని NCM వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో బలమైన గాలులు వీచి దుమ్ము, ఇసుక ఎగిరే అవకాశం ఉందని హెచ్చరించింది. మదీనా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు జిజాన్కు వెళ్లే తీరప్రాంత రహదారిపైనా దుమ్ము, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర సరిహద్దు ప్రాంతాలు, అల్ ఖాసిమ్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పేర్కొంది.
రియాద్‌లో పాక్షికంగా మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉంది. మక్కా, జెడ్డా, బురైదాలోనూ పాక్షికంగా మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని NCM తెలిపింది. హైల్లో పాక్షికంగా మేఘావృత వాతావరణంతో పాటు బలమైన గాలులు వీచవచ్చని పేర్కొంది. నజ్రాన్‌లో పాక్షికంగా మేఘావృతం ఏర్పడి, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
మదీనా, సకాకాలో బలమైన గాలులు వీచే అవకాశం ఉండగా.. దమ్మామ్‌లో మేఘావృత వాతావరణంతో పాటు గాలిలో దుమ్ము, పొగమంచు ఉండవచ్చని పేర్కొంది. అరార్లో దుమ్ము గాలుల అవకాశం ఉందని, తబూక్లో వాతావరణం సాధారణంగా నిర్మలంగా ఉంటుందని తెలిపింది.
అబ్హాలో ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు, పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. అల్ బహాలో ఉరుములతో కూడిన వర్షాలతో పాటు బలమైన గాలులు వీచవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. జిజాన్‌లో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడి, బలమైన గాలులతో పాటు దుమ్ము, ఇసుక తుఫాన్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్‌పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్‌లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్‌లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్‌లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







