ఒమన్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!

- August 09, 2026 , by Maagulf
ఒమన్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!

మస్కట్‌: ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒమన్‌ వాతావరణ శాఖ తెలిపింది. అల్‌ హజర్‌ పర్వతాలు, పరిసర ప్రాంతాల్లో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

అల్‌ వుస్తా, దోఫార్‌ గవర్నరేట్లకు చెందిన ఎడారి ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ.. సంబంధిత అధికారులు జారీ చేసే సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com