సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- August 09, 2026
మనామా: సౌదీ అరేబియాపై ఇరాన్ మద్దతున్న హౌతీ మిలీషియా చేపట్టిన మిస్సైల్ దాడులు, వాణిజ్య నౌకల భద్రతకు ముప్పు కలిగించే దాడులను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సభ్యులు చేసిన ప్రకటనను బహ్రెయిన్ స్వాగతించింది. ఈ మేరకు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సౌదీ అరేబియాకు బహ్రెయిన్ పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. సౌదీ సార్వభౌమత్వం, భద్రత, సుస్థిరత, కీలక ప్రయోజనాల పరిరక్షణ కోసం రియాద్ తీసుకునే అన్ని చర్యలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.
సౌదీ భద్రతే గల్ఫ్ భద్రత
సౌదీ అరేబియా భద్రత, సుస్థిరతలు బహ్రెయిన్‌తో పాటు అన్ని గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల భద్రతలో అంతర్భాగమని బహ్రెయిన్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సోదర సంబంధాలు, ఉమ్మడి భవిష్యత్తు, GCC ఉమ్మడి రక్షణ ఒప్పందం కింద ఉన్న బాధ్యతలను ఈ సందర్భంగా గుర్తుచేసింది.
యెమెన్‌లో సౌదీ అరేబియా చేపడుతున్న దౌత్య, అభివృద్ధి, మానవతా కార్యక్రమాలను కూడా బహ్రెయిన్ ప్రశంసించింది. యెమెన్‌లో చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్న సంకీర్ణానికి సౌదీ నాయకత్వం వహించడంతో పాటు, సమగ్ర, సుస్థిర రాజకీయ పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నాలను కొనియాడింది.
సముద్ర భద్రతకు సౌదీ కృషి
సముద్ర భద్రతను బలోపేతం చేయడం, నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని రక్షించడం, ప్రపంచ ఇంధన సరఫరాలకు భద్రత కల్పించడం లక్ష్యంగా బహుళజాతి సముద్ర రక్షణ కూటమి ఏర్పాటులో సౌదీ అరేబియా పోషించిన పాత్రను బహ్రెయిన్ ప్రశంసించింది. ప్రస్తుతం యూఎన్ భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఉన్న బహ్రెయిన్.. సముద్ర నౌకాయానం, అంతర్జాతీయ వాణిజ్య భద్రతకు ముప్పు కలిగించే దాడులను అడ్డుకునేందుకు అంతర్జాతీయ సమాజం తన బాధ్యతలను నిర్వర్తించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్‌పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్‌లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్‌లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్‌లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







