బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటిన వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’

- August 10, 2026 , by Maagulf
బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటిన వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను చూపించారు. హారర్ కామెడీగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటుకుని ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టింది. మేకర్స్ మొదటి నుంచే పెట్టుకున్న నమ్మకానికి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ మరింత బలాన్ని ఇస్తోంది.

సినిమాకు సంబంధించిన పాజిటివ్ బజ్ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే కనిపించాయి. అది ఇప్పుడు అద్భుతంగా వర్కౌట్ అయింది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ సినిమాకు బిగ్ ప్రమోషన్‌గా మారింది. రోజురోజుకూ ‘కొరియన్ కనకరాజు’కి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌కు చేరువలో ఉంది.

సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌లో ప్రధానంగా కామెడీకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం.. తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.37.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

 సోమవారం తెలంగాణలో బోనాలు సెలవు కావడంతో సినిమాకు మరో అడ్వాంటేజ్ లభించింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్భుతంగా ఉండటంతో, ఈ హాలిడే సినిమాకు మరింత బలమైన కలెక్షన్స్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ రికవరీ దశను దాటి ముందుకు వెళ్లింది. ఇక ఈ సినిమా ఎంత పెద్ద ప్రాఫిట్ అందుకుంటుందనేదే ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న మౌత్ టాక్, కామెడీకి లభిస్తున్న ఆదరణను చూస్తుంటే.. ‘కొరియన్ కనకరాజు’కు లాంగ్ రన్ ఉండబోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com