సౌదీలో 27,360 షెవర్లే కార్ల రీకాల్.. ఎయిర్‌బ్యాగ్ లో లోపం..!!
- August 11, 2026
రియాద్: ఎయిర్‌బ్యాగ్‌లో లోపం కారణంగా ప్రమాద సమయంలో తీవ్ర గాయాలు లేదా మరణం సంభవించే అవకాశం ఉందని గుర్తించిన సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ 27,360 షెవర్లే వాహనాలను రీకాల్ చేసింది. డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ ఇన్ఫ్లేటర్లో లోపం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్ తెరుచుకునే సందర్భంలో పదునైన లోహపు ముక్కలు బయటకు దూసుకొచ్చే ప్రమాదం ఉందని, దీనివల్ల వాహనంలోని వారికి తీవ్ర గాయాలు లేదా ప్రాణహాని కలగవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
ఈ రీకాల్ పరిధిలో షెవర్లే ట్రాక్స్, క్రూజ్, అవియో మోడళ్లు ఉన్నాయి. ట్రాక్స్ 2010–2017 మోడల్ , క్రూజ్ 2012–2018 మోడల్, అవియో 2010–2017 మోడల్ కార్లు ఉన్నాయి. తమ వాహనం రీకాల్ పరిధిలో ఉందో లేదో తెలుసుకునేందుకు వాహన యజమానులు వెహికల్ ఐడేంటీఫికేషన్ నంబర్ (VIN) ను ఉపయోగించి Recalls.sa వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలని సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది. రీకాల్‌కు సంబంధించిన వాహనాల యజమానులు జనరల్ మోటర్స్, అల్జోమైహ్ ఆటోమోటివ్ కంపెనీ లేదా యూనివర్సల్ మోటార్స్ ఏజెన్సీలను సంప్రదించి అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయించుకోవాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







