2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్‌ విహంగాలు: మంత్రి రామ్మోహన్‌ నాయుడు

- August 11, 2026 , by Maagulf
2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్‌ విహంగాలు: మంత్రి రామ్మోహన్‌ నాయుడు

న్యూ ఢిల్లీ: 2028 నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ విహంగాలు (ఈవీటీవోఎల్‌) ఎయిర్‌ ట్యాక్సీలను ఆపరేట్‌ చేయడంతో పాటు, వాటిని స్వయంగా తయారుచేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ‘సార్లా ఏవియేషన్‌’ సంస్థకు మూడో ‘ఈవీటీవోఎల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ అప్రూవల్‌'(డీవోఏ)ను అందజేశారు. ఈవీటీవోఎల్‌ విమానాలు నిలువుగా టేకాఫ్‌, ల్యాండింగ్‌ చేయడానికి అనువైన సాంకేతికతను కలిగివుంటాయి. దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్‌ గణనీయంగా తగ్గుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com